
హెచ్‌ఎండీ గ్లోబల్ మరో కొత్త స్మార్ట్‌ఫోన్ నోకియా 4.2ను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, పింక్ శాండ్ రంగుల్లో మార్కెట్‌లోకి వచ్చింది. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,990. ఇందులో 5.71 ఇంచుల డిస్‌ప్లే, 13 ఎంపీ+2ఎంపీ సెన్సార్లతో వెనుకవైపు డ్యూయల్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ ‘పై’ ఓఎస్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఏఐ ఫేస్ అన్‌లాగ్, వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ మంగళవారం నుంచి ఏడు రోజుల పాటు నోకియా అధికారిక ఈస్టోర్‌లో లభ్యమవుతుంది. ఆ తర్వాత ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ కొనుక్కోవచ్చు.