
గ్రేటర్ హైదరాబాద్ లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ బుధవారం నుంచి 20 వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. నామినేషన్ల స్వీకరణకు మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. గ్రేటర్ పరిధిలోని 150 రిటర్నింగ్ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటుగా మరో ఇద్దరికి మాత్రమే రిటర్నింగ్ అధికారి ఛాంబర్ లోని అనుమతి ఉంటుంది.
ఈ బుధవారం 17 మంది అభ్యర్థులు.. 20 నామినేషన్లు దాఖలు చేశారు. బిజెపి 2, కాంగ్రెస్ 3, టిఆర్ఎస్ 6, టిడిపి 5, ఇండిపెండెంట్లు 3, రికగ్నైజడ్ పార్టీ నుండీ ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు.
ఇక నగరంలో ఫ్లెక్సీలు, బ్యానర్లను జీహెచ్ఎంసి సిబ్బంది తొలగిస్తున్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగింపుకు 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసి ఎన్ఫోర్స్మెంట్ విభాగం. మంగళవారం ఒక్కరోజే నగరంలో దాదాపుగా నాలుగువేలకు పైగా ఫ్లెక్సీలు, బ్యానర్లను జీహెచ్ఎంసి తొలగించింది.