ఆర్మూర్ టౌన్ లోని ఇసుక శిల్పాల కేంద్రం ప్రారంభం

ఆర్మూర్ టౌన్ లోని  ఇసుక శిల్పాల కేంద్రం ప్రారంభం

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ టౌన్​లోని హౌజింగ్ బోర్డు సమీపంలో ఏర్పాటు చేసిన దశ అవతారం ఇసుక శిల్పాల కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబాగౌడ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి  సందర్భంగా కాంగ్రెస్ టౌన్ యూత్ ప్రెసిడెంట్ విజయ్ అగర్వాల్ ఆధ్వర్యంలో మొట్టమొదటి సారిగా విష్ణుమూర్తి దశావతారాలను ఇసుక శిల్పాలు గా ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. 

స్మైల్స్ స్కూల్ స్టూడెంట్స్ దశ అవతారం ఇసుక శిల్పాలను  సందర్శించారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ మొహమ్మద్ రఫీయొద్దీన్ గౌహర్, శిల్పి బాలాజీ వరప్రసాద్ మాజీ వైస్​ చైర్మన్ షేక్​ మున్ను , మోత్కురి లింగా గౌడ్, నాయకులు ఖాందేశ్ శ్రీనివాస్, అతిక్, ఫయాజ్, అజ్జు, చిట్టి రెడ్డి, రాజు, భూపేంధర్​, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.