- నామినేషన్ల కేంద్రం పరిశీలన
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 114 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆదివారం రెండో దశకింద సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది. మొదటి రోజు43 నామినేషన్లు సమర్పించారు.
బెల్లంపల్లి మండలంలోని 11 సర్పంచ్ స్థానాలకు, తాండూరులో 8, కాసిపేటలో 3, భీమినిలో 4, నెన్నెలలో 5, వేమనపల్లిలో 8, కన్నెపల్లిలో 6 స్థానాలకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రాలను బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ మనోజ్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, సి.ఐ. దేవయ్య, కన్నెపల్లి ఎస్సై భాస్కర్‌రావులు పరిశీలించారు.
