ఆ గ్రామంలో సర్పంచ్ పదవికి నామినేషన్లు నిల్

ఆ గ్రామంలో సర్పంచ్ పదవికి నామినేషన్లు నిల్
  • ఏడు వార్డులకూ నామినేషన్లు జీరో...

నిర్మల్, వెలుగు:  రిజర్వేషన్ల కేటాయింపుపై నిర్మల్ జిల్లాలోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎస్సీ, ఎస్టీలు ఒక్కరు కూడా నివసించని గ్రామాలకు ఆ కేటగిరీల్లో రిజర్వేషన్ కేటాయించడంతో పలు చోట్ల సర్పంచ్, వార్డు మెంబర్ పదవులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దస్తురాబాద్ మండలం  పేర్కపల్లి గ్రామ పంచాయతీని ఎస్సీ (జనరల్)కు రిజర్వ్ చేశారు. అయితే ఆ గ్రామంలో ఒక్క ఎస్సీ  కూడా లేరు. ఫలితంగా సర్పంచ్ పదవికి ఒక్క నామినేషన్ రాలేదు. 

అదే గ్రామంలో వార్డు నెం. 1 (ఎస్సీ మహిళ), వార్డు నెం. 2 (ఎస్సీ జనరల్)లకు కూడా ఎవరూ పోటీ చేయలేదు. ఇదే మండలంలోని  అనంతపేట గ్రామ వార్డు నెం. 2ను ఎస్టీ (జనరల్)కు కేటాయించగా, అక్కడ ఎస్టీలు లేకపోవడంతో ఆ వార్డులో  నామినేషన్ దాఖాలు కాలేదు. అలాగే బూరుగుపల్లి గ్రామంలో వార్డు నెం. 5కు కూడా ఎవరూ దరఖాస్తు చేయలేదు.  కల్కడెం మండలంలో  ఇస్లాంపూర్ గ్రామం వార్డు నెం. 4,  అల్లంపల్లి గ్రామం వార్డుల నెం. 8, 10లకు కూడా నామినేషన్లు దాఖలు కాలేదు.ఆ గ్రామంలో సర్పంచ్​ పదవికి నామినేషన్లు నిల్