సింగరేణిలో నామినేషన్ల పర్వం షురూ 

సింగరేణిలో  నామినేషన్ల పర్వం షురూ 
  •     నామినేషన్ల పర్వం షురూ 
  •     శుక్రవారం నామినేషన్​వేసిన పది యూనియన్ల ప్రతినిధులు
  •     శనివారం దాఖలు చేయనున్న టీబీజీకేఎస్​ 
  •     11న రానున్న తీర్పుపై టెన్షన్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు  సింగరేణి ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ నెల 28 సింగరేణిలో ఎన్నికలు నిర్వహించేందుకు సెంట్రల్​డిప్యూటీ లేబర్​కమిషనర్, రిటర్నింగ్​ఆఫీసర్​శ్రీనివాసులు ఇటీవలే ఎన్నికల నోటిఫికేషన్​రిలీజ్​చేశారు. శుక్రవారం నామినేషన్ల స్వీకరణ మొదలైంది. దీంతో మొదటి రోజు ఏఐటీయూసీ, బీఎంఎస్​, హెచ్ఎమ్మెస్​, సీఐటీయూ, ఐఎన్​టీయూసీ, ఇఫ్టూతో పాటు మొత్తం పది కార్మిక సంఘాలు హైదరాబాద్​లోని సెంట్రల్​డిప్యూటీ లేబర్​కమిషనర్​ఆఫీస్​లో నామినేషన్లను దాఖలు చేశాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించలేమని సింగరేణి యాజమాన్యం నెల కిందట హైకోర్టుకు వెళ్లింది. సింగరేణిలోని టీబీజీకేఎస్​తోపాటు మొత్తం 11 కార్మిక సంఘాలు కూడా ఎన్నికలను వాయిదా వేయాలని కోరాయి. అయితే, కోర్టు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని చెప్పడంతో రిటర్నింగ్​ఆఫీసర్​గత నెల 27న ఎన్నికల నోటిఫికేషన్​రిలీజ్​చేశారు. దీంతో నామినేషన్ల స్వీకరణ మొదలుకావడంతో 15 సంఘాలకు గాను10 సంఘాల నుంచి నామినేషన్లు వేశాయి. నిన్న మొన్నటి వరకు గుర్తింపు సంఘంగా ఉన్న బీఆర్ఎస్​అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్​మాత్రం నామినేషన్​వేయలేదు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు యూనియన్​ముఖ్య నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. ఇందులో శనివారం నామినేషన్​వేయాలని డిసైడ్​అయ్యారు.  

నామినేషన్​ వేయకపోతే అనర్హులవుతారని.. 

సింగరేణిలో గుర్తింపుసంఘం ఎన్నికలను వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యంతో పాటు టీబీజీకేఎస్, ఐఎన్​టీయూసీ, హెచ్ఎమ్మెస్, ఇఫ్టూ వంటి మొత్తం 11 సంఘాలు డిప్యూటీ సెంట్రల్ ​లేబర్​కమిషనర్​కు విన్నవించుకున్నాయి. అయితే, కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నామంటూ ఏఐటీయూసీ, బీఎంఎస్​ యూనియన్ల ప్రతినిధుల సమక్షంలో రిటర్నింగ్​ఆఫీసర్​ శ్రీనివాసులు నోటిఫికేషన్ ​రిలీజ్​ చేశారు. మరో వైపు ఎన్నికలు వాయిదా వేయాలని సింగిల్​జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ ​చేస్తూ సింగరేణి యాజమాన్యం మూడు రోజుల కింద డివిజన్​ బెంచ్​కు వెళ్లింది. ఇరుపక్షాల వాదనలు విన్న డివిజన్​ బెంచ్​ఈ నెల11కు కేసు వాయిదా వేసింది. సెంట్రల్​డిప్యూటీ లేబర్​కమిషనర్ ​మాత్రం ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూ షెడ్యూల్​ విడుదల చేశారు. కోర్టు తీర్పు పక్కన పెడితే షెడ్యూల్ ​ప్రకారంగా నామినేషన్లు వేయకపోతే ఎన్నికల్లో ఆయా సంఘాలు అనర్హతకు లోనయ్యే అవకాశం ఉండడంతో ఏఐటీయూసీ, బీఎంఎస్ సంఘాలతో పాటు ఎన్నికలు వాయిదా వేయాలని కోరిన ఐఎన్​టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎమ్మెస్​, ఇఫ్టూతో పాటు మరికొన్ని సంఘాలు నామినేషన్లు వేశాయి. కోర్టు తీర్పు ఎలా ఉన్నా శనివారం నామినేషన్​ వేయాలని టీబీజీకేఎస్​ నిర్ణయించుకుంది.సాయంత్రం వరకు నామినేషన్లకు గడువు ఉందని రిటర్నింగ్‌‌ ఆఫీసర్‌‌ శ్రీనివాసులు తెలిపారు. 

నామినేషన్లు వేసింది వీరే..

బీఎంఎస్​ తరపున సింగరేణి కోల్​మైన్స్​కార్మిక సంఘ్ ​రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి పవన్​ కుమార్, వర్కింగ్​ ప్రెసిడెంట్ ​పేరం రమేశ్, ఏబీకేఎంఎస్​ నేతలు పులి రాజారెడ్డి, ఆరుట్ల మాధవరెడ్డి, సింగరేణి కాలరీస్​వర్కర్స్​ యూనియన్​(ఏఐటీయూసీ) తరపున ఆ యూనియన్ ​అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, నాయకులు బాలరాజు, వంగా వెంకట్, బోసు, వేణు నామినేషన్లు వేశారు. హెచ్ఎమ్మెస్​ నుంచి ఆ యూనియన్​అధ్యక్షుడు రియాజ్​అహ్మద్, ఐఎన్​టీయూసీ నుంచి జనరల్​సెక్రెటరీ జనక్​ ప్రసాద్, నాయకులు చంద్రశేఖర్, నరసింహారెడ్డి, త్యాగరాజన్​నామినేషన్లు దాఖలు చేశారు.