సాగర్ ఉప ఎన్నిక: ఓటు వేసిన నోముల భగత్

సాగర్ ఉప ఎన్నిక: ఓటు వేసిన నోముల భగత్

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు ఓటర్లు. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుందనే భయంతో..ముందే వచ్చి ఓటేసి వెళ్తున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాల భారీ లైన్లు కనిపిస్తున్నాయి. నాగార్జునసాగర్ జూనియర్ కాలేజీలో ఏజెంట్ రాకపోవడంతో పోలింగ్ నిలిపేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తర్వాత పోలింగ్ ప్రారంభించారు అధికారులు. అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర కరోనా నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేశారు. మాస్క్ ఉంటేనే ఓటేసేందుకు అనుమతి ఇస్తున్నారు. 

టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి వచ్చి.. ఇబ్రహీంపేటలోని MPUPS స్కూళ్లో ఓటేశారు. ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తంచేశారు భగత్. 

నాగార్జునసాగర్ బైపోల్ బరిలో 41 మంది అభ్యర్థులున్నారు. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి, టీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్, బీజేపీ నుంచి డాక్టర్ రవి నాయక్ మధ్య ప్రధాన పోటీ ఉంది. వీరితోపాటు.. మరో 38 మంది ఇండిపెండెంట్ అభ్యర్థుల భవితవ్యాన్ని ఇవాళ సాగర్ ఓటర్లు తేల్చబోతున్నారు.