వర్తన చేతికి ఐఎఫ్​ఎస్​సీ

వర్తన చేతికి ఐఎఫ్​ఎస్​సీ

హైదరాబాద్, వెలుగు : ఇండియన్ స్కూల్ ఫైనాన్స్ కంపెనీ (ఐఎఫ్​ఎస్​సీ) స్కూల్ పోర్ట్ ఫోలియోను కొనుగోలు చేసినట్టు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌‌బీఎఫ్‌‌సీ)  వర్తన ఫైనాన్స్ ప్రకటించింది. ఈ డీల్​ విలువ రూ.126 కోట్లు. ఈ సంస్థ తక్కువ వడ్డీ రేట్లకు  ఉన్నత చదువుల కోసం లోన్లు అందించే సంస్థ. ఐఎఫ్​ఎస్​సీ తమ చేతికి రావడం వల్ల మరింత మంది స్టూడెంట్లకు అందుబాటు ధరల్లో నాణ్యమైన

చదువును అందించడం వీలవుతుందని వర్తన సీఈఓ స్టీవ్​ హార్డ్​గ్రేవ్​తెలిపారు. గత 15 ఏళ్లలో ఐఎఫ్​ఎస్​సీ 50 లక్షల మందికి మద్దతు ఇచ్చిందని, దీనికి వెయ్యి స్కూళ్లు ఉన్నాయని  వివరించారు. బెంగళూరుకు చెందిన వర్తన ఫైనాన్స్​కు 16 రాష్ట్రాల్లో 40 బ్రాంచ్​లు ఉన్నాయి.