
కొంతమంది సైనికులు ఓ ఆర్మీ వాహనంలో కూర్చొని తమ పై అధికారి బుల్లెట్ ప్రూఫ్ లేని ట్రక్కుల్లో తమని పంపించారంటూ సైనికులు చర్చించుకుంటున్నారు. ఆ చర్చించుకుంటున్న వీడియోను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధానికి అన్నీ రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు కానీ సైనికుల్ని పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సైనికుల్ని అమరవీరుల్ని చేయడానికి బుల్లెట్ ఫ్రూఫ్ లేని ట్రక్కుల్లో పంపుతున్నారని, అదే ప్రధాని కోసం రూ.8400 కోట్లు విలువ చేసే విమానామా..? ఇదెక్కడి న్యాయం అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై మండిపడ్డారు.