సిటీ నుంచి అమెరికాకు నాన్‌‌‌‌స్టాప్‌‌‌‌ ఫ్లయిట్‌‌‌‌ సర్వీస్‌‌‌‌

సిటీ నుంచి అమెరికాకు నాన్‌‌‌‌స్టాప్‌‌‌‌ ఫ్లయిట్‌‌‌‌ సర్వీస్‌‌‌‌

జనవరి 15 నుంచి స్టార్ట్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: జనవరి 15 నుంచి  జీఎంఆర్ హైదరాబాద్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌ నుంచి అమెరికాలోని చికాగోకి నాన్ స్టాప్‌‌‌‌ ఫ్లయిట్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లు స్టార్‌‌‌‌‌‌‌‌ కానున్నాయి. ప్రభుత్వ కంపెనీ ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియా బోయింగ్‌‌‌‌ 777–200 ఫ్లయిట్‌‌‌‌ను ఈ రెండు సిటీల మధ్య నడపనుందని జీఎంఆర్ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది. హైదరాబాద్‌‌‌‌–యూఎస్‌‌‌‌ఏ–హైదరాబాద్‌‌‌‌ బేసిస్‌‌‌‌లో ఈ సర్వీస్‌‌‌‌ ఉంటుంది. బోయింగ్‌‌‌‌ 777–200 విమానం సీట్‌‌‌‌ కెపాసిటీ 238 సీట్లు. ఏడాదికి 7 లక్షల మంది ప్యాసెంజర్లు హైదరాబాద్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌ నుంచి అమెరికాకు వెళుతున్నారని జీఎంఆర్ పేర్కొంది. హైదరాబాద్‌‌‌‌–చికాగో నాన్‌‌‌‌స్టాప్‌‌‌‌ రూట్‌‌‌‌ తమ కనెక్టివిటీ విష్‌‌‌‌ లిస్ట్‌‌‌‌లో కంపెనీ సీఈఓ ప్రదీప్‌‌‌‌ పనికర్‌‌‌‌‌‌‌‌ అన్నారు.