
నోరా ఫతేహి (Nora Fatehi).. ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేవి స్పెషల్ సాంగ్స్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పదిహేనుకు పైగా స్పెషల్ సాంగ్స్ చేసింది నోరా. వాటిలో చాలావరకూ సూపర్ హిట్స్ కావడం విశేషం. ‘టెంపర్’చిత్రంతో టాలీవుడ్‌కు వచ్చిన ఆమె.. బాహుబలి, కిక్ 2, షేర్, లోఫర్, ఊపిరి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది.
నోరా ఫతేహి గతేడాది వరుణ్ తేజ్ ‘మట్కా’లో కనిపించింది. ఇప్పటికే హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ ఇండస్ట్రీస్‌లో వర్క్ చేసిన ఆమె.. ఇప్పుడిక కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. లారెన్స్ రాఘవ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘కాంచన 4’లో ఆమె కీలకపాత్ర పోషిస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా రివీల్ చేసింది.
తన కోలీవుడ్ ఎంట్రీకి ఇది సరైన ప్రాజెక్ట్‌గా భావిస్తున్నానని చెప్పింది. స్క్రిప్ట్ ఎంతో యూనిక్‌గా ఉందని, స్ట్రాంగ్ లెగసీ ఉన్న ఇలాంటి హారర్ కామెడీ ఫ్రాంచైజీతో ఎంట్రీ ఇస్తుండడం హ్యాపీ ఉందని చెప్పింది. ఇక కొత్త భాష అనేది ఎప్పటికీ ఛాలెంజ్ అని, ఇప్పటికే తెలుగు, మలయాళ భాషల్లో వర్క్ చేసిన తాను, ఇప్పుడిక తమిళ భాషకు అలవాటు పడతున్నానని వెల్లడించింది. బాలీవుడ్‌తో పోల్చితే కోలీవుడ్ వర్కింగ్ స్టయిల్ తనకు డిఫరెంట్‌గా అనిపించిందని నోరా చెప్పింది.
ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో మూడు సినిమాలు చేసిన లారెన్స్.. ఇప్పుడు ‘కాంచన 4’తో వస్తున్నాడు. ఇందుకోసం ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ గోల్డ్ మైన్స్ వంద కోట్లకుపైగా బడ్జెట్ కేటాయించింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో హీరోయిన్‌గా పూజాహెగ్డే నటిస్తున్నట్లు సమాచారం.