
కెనడియన్ బ్యూటీ, బాలీవుడ్ నటి నోరా ఫతేహి(Nora Fatehi) ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez) పై వేసిన పరువు నష్టం కేసులో తన వాంగ్మూలాన్ని సోమవారం నమోదు చేసింది. సుకేష్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిందితురాలు కావడం గమనార్హం.
చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో నోరా ఫతేహి,చాహత్ ఖన్నా సాక్షులు.. కనుకే కేసును ఢిల్లీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఫతేహి లేటెస్ట్ గా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి)లోని 164 కింద ఫతేహి తన వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేస్తూ..
నేను ఈ కేసును ఎందుకు ఫైల్ చేస్తున్నాను అంటే, కాన్ ఆర్టిస్ట్ సుకేష్‌కు సంబంధించిన ED కేసు కొనసాగుతోంది, దానితో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ వ్యక్తులు ఎవరో నాకు తెలియదు..అని ఫతేహి చెప్పారు. ఎందుకంటే, ఒక ఈవెంట్ కి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. నేను బయటి వ్యక్తిని.. నేను ఈ దేశంలో ఒంటరిగా ఉన్నందున, కొంతమంది వ్యక్తుల ప్రతిష్టను కాపాడటానికి మీడియాలో ఈ కేసులో నన్ను బలిపశువుగా మార్చారు. అందులో భాగంగా వారు నన్ను గోల్డ్ డిగ్గర్ అని పిలిచారు. అలాగే చంద్రశేఖర్ తో నాకు రిలేషన్ ఉందని ఆరోపించారు. వారి దృష్టిని మరల్చడానికి నా పేరును కొనసాగుతున్న క్రిమినల్ కేసులో చేర్చారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ కేసులో తన పేరు ప్రమేయం వల్ల ఉద్యోగావకాశాలు, కీర్తి ప్రతిష్టలు కోల్పోయారని, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఆమె పేర్కొంది. గత ఎనిమిదేళ్లుగా నేను ఎన్నో ప్రాబ్లమ్స్ పేస్ చేసి కెరీర్ ని నిర్మించుకున్న.. కానీ ఇపుడు నా ఇమేజ్ డామేజ్ కావడం నన్ను ఎంతో బాధించాయి. అందువల్ల జరిగిన నష్టానికి పరిహారం కావాలని ఫతేహిపేర్కొన్నారు.
గత ఏడాది డిసెంబర్ 12న, సుఖేష్ చంద్రశేఖర్‌పై మనీలాండరింగ్ కేసులో ఉన్న నోరా ఫతేహి.. ఇదే కేస్ లో ప్రమేయం ఉన్న జాక్వెలిన్‌పై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసేందే.
నోరా ఫతేహి మట్కా మూవీలో ఓ స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించనుందట.దీంతో పాటు ఒక స్పెషల్ సాంగ్ కు డాన్స్ చేస్తోందని సమాచారం. నోరా ఫతేహి క్రిష్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లు మూవీలో కూడా నటిస్తోంది.