ముంబైలో నేటినుంచి ఫుల్‎టైం క్లాసులు

ముంబైలో నేటినుంచి ఫుల్‎టైం క్లాసులు

ముంబైలో కరోనాతో కొన్నాళ్ల నుంచి మూతపడిన పాఠశాలలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పాఠశాలల్లో 100 శాతం ఆఫ్‌లైన్‎లో క్లాసులు మొదలుకానున్నాయి.  దాంతో కోవిడ్‌కు ముందు ఉన్న సమయాలకనుగుణంగానే తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు బృహన్‌ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.  ఆ సర్క్యులర్ ప్రకారం.. అన్ని తరగతుల, అన్ని మీడియంల పాఠశాలలు ఓపెన్ కానున్నాయి. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఆఫ్‌లైన్ క్లాసులకు సుముఖంగా లేరు. మరికొంతకాలం ఆన్‎లైన్ తరగతులు నిర్వహించాలని కోరుతున్నారు.

కాగా.. పాఠశాలలు తెరచుకున్నా, విద్యార్థులను తీసుకురావడానికి కావలసని స్కూల్ బస్సులు మాత్రం సిద్ధంగా లేవు. కరోనా కారణంగా ధరలు పెరగడంతో తమ బస్సులకు చెల్లించే మొత్తాన్ని కూడా పెంచాలని బస్సు యజమానులు డిమాండ్ చేస్తున్నారు. బుధవారం స్కూళ్లు తెరవాలని అధికారులు నిర్ణయించినప్పటికీ.. బస్సులు రెడీగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.  బస్సులు అందుబాటులో లేనందున ప్రస్తుతం 9, 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే క్లాసులు నిర్వహిస్తున్నారు.

For More News..

నాటి కమెడియన్... నేటి ఉక్రెయిన్ అధ్యక్షుడు