ఈ రేసింగ్ ట్రాక్పైకి దూసుకొచ్చిన వేరే బండ్లు

ఈ రేసింగ్ ట్రాక్పైకి దూసుకొచ్చిన వేరే బండ్లు

ఫార్ములా రేసింగ్ ట్రాక్పై గందరగోళం నెలకొంది. ట్రాక్ మీదకు పబ్లిక్ వెహికిల్స్ సడెన్గా దూసుకొచ్చాయి. స్థానిక పోలీసుల నిర్లక్ష్యంతోనే సాధారణ వాహనదారులు ట్రాక్ పైకి వచ్చారని నిర్వాహకులు ఆరోపించారు. దీంతో పోలీసుల తీరుపై ఎఫ్ఐఏ బృందం సీరియస్ అయ్యింది. రేసింగ్ ట్రాక్ పైకి సాధారణ వెహికిల్స్కు అనుమతి లేదు. కాగా రేపటినుంచి ఈ రేస్ ప్రారంభంకానుంది. కాసేపట్లో ఫార్ములా ఈ ప్రాక్టీస్ రేస్ స్టార్ట్ అవ్వనుంది. లుంబినీ పార్క్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వరకు రేస్ సాగనుంది. మొత్తం 11 జట్ల నుంచి  22 మంది డ్రైవర్లు  ఈ ప్రీ రేస్ లో పాల్గొననున్నారు. నేడు జరిగే ప్రాక్టీస్ రేస్ తో రేసర్లకు ఈ ట్రాక్ మీద ఒక అవగాహన  రానున్నది.  18 మలుపులతో కూడిన ఈ ట్రాక్ పై ఎలా స్పందిస్తుంది.. కార్లను ఎలా  అదుపు చేసుకోవాలనే దానిపై వారికి స్పష్టమైన అవగాహన కలిగేందుకు ఈ ప్రీ రేసును నిర్వహించనున్నారు.