వాషింగ్టన్: చైనా నుంచి తమ దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించకుండా నిరోధిచేందుకు షూట్ టూ కిల్ ఆర్డర్స్‌ను నార్త్ కొరియా విధించిందని సమాచారం. సౌత్‌లోని యూఎస్ ఫోర్సెస్ కమాండర్స్ ద్వారా ఈ విషయం తెలిసింది. కరోనా వ్యాప్తి మొదలైతే అన్ని దేశాల మాదిరే నార్త్ కొరియా కూడా తీవ్ర ఆరోగ్య సమస్యలన ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలుస్తోంది. కరోనా భయంతో ఈ ఏడాది జనవరిలో కొరియా తన సరిహద్దులను మూసేసింది. తమ దేశంలో ఎమర్జెన్సీని గరిష్ట స్థాయికి పెంచారని ఆ దేశ మీడియా జూలైలో పేర్కొంది. దీని వల్ల స్మగుల్ గూడ్స్‌కు డిమాండ్ పెరుగుతోందని, ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకోవాలని కొరియాలో యూఎస్ ఫోర్సెస్ (యూఎస్ఎఫ్కే) కమాండర్ రాబర్ట్ అబ్రామ్స్ తెలిపాడు. ‘నార్త్ కొరియా ఓ బఫర్ జోన్‌ను ఏర్పాటు చేసింది. చైనా బార్డర్‌లో ఒకటి లేదా రెండు కిలో మీటర్ల మేర ఈ జోన్ ఉంటుంది. అక్కడ నార్త్ కొరియన్ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్‌ను దింపారు. వాళ్లకు కనిపిస్తే కాల్చి వేయాలని ఆదేశాలు ఇచ్చారు’ అని అబ్రామ్స్ పేర్కొన్నాడు.
