నార్త్ కొరియాలో కరోనా పంజా... జ్వరంతో ఆరుగురు మృతి
V6 Velugu Posted on May 13, 2022
అస్సలు రాదేరాదు అని గర్వంగా చెప్పుకున్న నార్త్ కొరియా ఇప్పుడు వణుకుతోంది. కరోనా వైరస్ తో ప్రజలు తీవ్ర భయాందోలనలు చెందుతున్నారు. చైనాలో వైరస్ వెలుగు చూసిన తర్వాత.. కఠినమైన ఆంక్షలు విధించాడు అధ్యక్షులు కిమ్ జింగ్ ఉన్. ఇప్పుడు వేల మందిలో కరోనా లక్షణాలున్నట్లు అక్కడి అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. లెటెస్ట్ గా జ్వరంతో బాధ పడుతున్న ఆరుగురు చనిపోయారని శుక్రవారం ప్రకటించింది. మూడు లక్ష్లల మంది తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్నట్లు, దాదాపు 18 వేల మందిలో కరోనాకు సంబంధించిన లక్షణాలు కనిపించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ప్రస్తుతం 16 వేల మంది చికిత్స పొందుతున్నారు.
మరోవైపు.. ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జోంగ్ ఉన్ యాంటీ వైరస్ కమాండ్ సెంటర్ ను సందర్శించారు. అక్కడున్న పరిస్థితులపై ఆరా తీశారు. శాస్త్రీయ చికిత్స విధానం ద్వారా కరోనా వైరస్ ను ఎలా ఎదుర్కొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జ్వరంతో బాధ పడుతున్న వారిని వేరుగా ఉంచి చికిత్స అందించాలని సూచించారు. ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్ లు పంపే చర్యలు ఏమి తీసుకోవడం లేదని యూఎస్ స్పష్టం చేసినట్లు సమాచారం. మరి కరోనా వైరస్ విరుగుడికి ఉత్తర కొరియా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
మరిన్ని వార్తల కోసం :
అంబూరు ఫెస్టివల్.. బీఫ్, పోర్క్ బిర్యానీలకు అనుమతివ్వ లేదని కలెక్టర్‌కు నోటీసులు
Tagged , North Korea covid, Covid report, North Korea six deaths, COVID-19 Latest News, North Korean Central Agency, COVID-19 tests, India Corona Update