UAE అధ్యక్షులు ఇకలేరు

UAE అధ్యక్షులు ఇకలేరు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షులు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తుది శ్వాస విడిచారు. 73 సంవత్సరాల వయస్సులో శుక్రవారం కన్నుమూసినట్లు అక్కడి ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆయన ఎలా మృతి చెందారనేది తెలియరాలేదు. అయితే.. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు సమాచారం. షేక్ ఖలీఫా మృతి చెందారనే వార్త తెలుసుకున్న ప్రముఖులు, ఇతరులు సంతాపం తెలియచేస్తున్నారు. యూఏఈ అధ్యక్షులు మృతికి సంతాపంగా 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. జెండాలను అవనతం చేశారు. 

2004లో UAE రెండో అధ్యక్షులుగా షేక్ ఖలీఫా (Sheikh Khalifa) బాధ్యతలు స్వీకరించారు. అత్యంత సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చిన ఆయన అతని తండ్రి తర్వాత 16వ పాలకుడిగా బాధ్యతలు చేపట్టారు. 2014 నుంచి చాలా అరుదుగా ఆయన బయట కనిపించేవారు. 2009లో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న క్రమంలో.. దుబాయ్ ను రక్షించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. బిలియన్ డాలర్ల సామ్రాజాన్ని విస్తరించారు. ఆయన మృతి తీరని లోటని, చొరవ.. ఔదార్యం చాలా గొప్పదని కొనియాడారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ట్వీట్ చేశారు. షేక్ ఖలీఫా ఎప్పుడూ కేరళ రాష్ట్రానితో సంబంధాలు కొనసాగించారని తెలిపారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు, ఎమిరేట్స్ ను ఆధునీకరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. 

మరిన్ని వార్తల కోసం 

విభజన హామీలతో తెలంగాణకు రండి..

శ్రీలంకలో ప్రజల ఆగ్రహావేశాలు.. మంత్రి కారును ఏం చేశారో తెలుసా ?