
సికింద్రాబాద్, వెలుగు: బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్లు విక్రయిస్తున్న ఇద్దరిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5 లక్షల విలువైన 100 ఐపీఎల్ టికెట్లు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. బెంగళూరులో ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగి చిత్తూరు రమణ(27), హైదరాబాద్‌లో ఉంటూ డిజిటల్మార్కెటింగ్ చేస్తున్న న్యాలకల్ సామ్యుయేల్సుశీల్(29) ఫ్రెండ్స్.
దేశంలోని క్రికెట్అభిమానులతో కూడిన వాట్సాప్ గ్రూపుల్లో వీళ్లు మెంబర్లు. మ్యాచ్‌ల టైంలో టికెట్ల గురించి ఆరా తీస్తుంటారు. అలాగే ఇద్దరూ కలిసి ఆన్లైన్లో టికెట్లు బుక్చేస్తుంటారు. రమణ గతంలో వన్డే క్రికెట్ మ్యాచ్టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తూ చెన్నై పోలీసులకు చిక్కాడు. అయినా మార్పు రాలేదు. ఈజీ మనీ కోసం బ్లాక్‌లో టికెట్లు విక్రయించాలని ప్లాన్చేశాడు. సామ్యుయేల్సుశీల్తో కలిసి ఐపీఎల్అభిమానులను టార్గెట్చేశారు. ఆన్లైన్లో టికెట్లు పెట్టిన వెంటనే బుక్‌చేసి, వాటిని బయట అధిక ధరలకు అమ్ముతున్నారు. గురువారం ఎస్ఆర్హెచ్, బెంగళూరు మ్యాచ్‌కు పెద్ద ఎత్తున బ్లాక్‌లో అమ్మాలని చూసి పోలీసులకు చిక్కారు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి గోపాలపురం పోలీసులకు అప్పగించారు.