శృంగార‌ సామర్థ్యం పెరుగుతుందంటూ డ్రగ్స్ అమ్మకాలు

శృంగార‌ సామర్థ్యం పెరుగుతుందంటూ డ్రగ్స్ అమ్మకాలు

హైద‌రాబాద్‌లో ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్: నగరంలో మరోసారి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. శృంగార‌ సామర్థ్యం పెరుగుతుందంటూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పబ్‌లకు వచ్చే వాళ్లను ఆకర్షించి పెద్ద ఎత్తున డ్రగ్స్‌ అమ్మకాలు జోరుగా సాగుతున్నట్టు తెలిసింది. 200 గ్రాముల మత్తు మందు మెఫిడ్రిన్‌ స్వాధీనం చేసుకున్నట్టు నార్త్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. ముంబై నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి హైదరాబాద్‌లో ఈ ముఠా విక్రయిస్తోంది. ప్రముఖ హోటల్‌లో పనిచేసిన చెఫ్‌ సలీమ్‌ సూత్రధారిగా గుర్తించారు. టెలిమార్కెటింగ్‌ చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.