సోనూసూద్కు రైల్వే శాఖ వార్నింగ్

సోనూసూద్కు రైల్వే శాఖ వార్నింగ్

బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ కు రైల్వే శాఖ వార్నింగ్ ఇచ్చింది. ట్రైన్ ఫుట్ బోర్డుపై  ప్రయాణించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనేక మందికి రోల్ మోడల్ అయిన సోనూ ఇలాంటి ప్రమాదకరమైన చర్యకు పాల్పడటం సరికాదని అభిప్రాయపడింది. సోనూ వీడియో దేశానికి తప్పుడు సందేశాన్ని  ఇస్తుందని రైల్వే శాఖ చెప్పింది. సోనూసూద్.. మీరు దేశంలో,  ప్రపంచంలోని మిలియన్ల మందికి రోల్ మోడల్. రైలు మెట్లపై ప్రయాణించడం ప్రమాదకరం. ఈ రకమైన వీడియో మీ అభిమానులకు తప్పుడు సందేశాన్ని చేరవేయవచ్చు. దయచేసి ఇలా చేయకండి! సాఫీగా, సురక్షితమైన ప్రయాణం చేస్తూ ఎంజాయ్ చేయండి" అని ఉత్తర రైల్వే ట్వీట్ చేసింది.

నటుడు సోనూ సూద్ డిసెంబర్ 13న ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తున్న రైలు ప్రయాణ వీడియోను అప్‌లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తర రైల్వే ఈ ట్వీట్ చేసింది. ముంబయి రైల్వే పోలీస్ కమిషనరేట్ కూడా ఇది ప్రమాదకరమని పేర్కొంటూ హెచ్చరించింది. నిజ జీవితంలో ఈ స్టంట్ చేయవద్దని కోరింది. సోనూసూద్ ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణించడం సినిమాల్లో 'ఎంటర్‌టైన్‌మెంట్'కి మూలం కావచ్చు, కానీ నిజ జీవితంలో కాదు! అన్ని భద్రతా మార్గదర్శకాలను అనుసరించండి. అందరికీ 'హ్యాపీ న్యూ ఇయర్'ని అందిద్దాం" అని జీఆర్పీ ముంబయి ట్వీట్ చేసింది.