"కాలా చష్మా" కు నార్వే "క్విక్ స్టైల్" బృందం స్టెప్పులు

"కాలా చష్మా" కు నార్వే "క్విక్ స్టైల్" బృందం స్టెప్పులు

వేడుకకు తగ్గట్టు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా తోడైతే.. కాలు కదపకుండా ఉండలేం కదా. సంగీతం వింటే కొన్నిసార్లు మనసుకు ఆనందం కలుగుతుంది. మరికొన్ని సార్లు ఆ మ్యూజిక్ కు తగ్గట్టు డ్యాన్స్ కూడా చేస్తే.. ఇంకేముంది చేసే వారికీ.. చూసేవారికీ ఆహ్లాదంగా ఉంటుంది. అలాంటి సంఘటనే నార్వేలో జరిగింది. ఓ వెడ్డింగ్ పార్టీలో పాల్గొన్న "క్విక్ స్టైల్" అనే బృందం పాటకు తగ్గట్టు కాలు కదుపుతూ అందర్నీ ఆకట్టుకున్నారు. అది ఏ పాటకనుకున్నారు. బాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో ఫేమస్ అయిన "బార్ బార్ దేఖో" మూవీ లోని "కాలా చష్మా" సాంగ్. ఈ పాటను వింటే మామూలుగానే ఊపొస్తుంది. అలాంటిది పెద్ద సౌండ్ పెట్టి.. దానికి బృందంగా ఏర్పడి డ్యాన్స్ చేస్తే.. ఎలా ఉంటుంది. వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది కదా. అయితే చూస్తే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. వాళ్ల అదిరిపోయే స్టెప్స్, వాళ్లు చేసిన డ్యాన్స్ ఆ వెడ్డింగ్ పార్టీకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఈ వీడియోను ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పటి వరకూ 7 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకొని ట్రెండింగ్ అవుతోంది. ఇంతకూ ఆ  క్విక్ స్టైల్ గ్రూప్ చేసిన డ్యాన్స్ ఎలా ఉందో చూడాలంటే.. ఇప్పుడే వీక్షించి.. ఎంజాయ్ చేయండి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yasin Tatby (@yasintatby)