అగ్రి వర్సిటీ స్థలాన్ని హైకోర్టుకు కేటాయించొద్దు

అగ్రి వర్సిటీ స్థలాన్ని హైకోర్టుకు కేటాయించొద్దు
  •   ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ

 గండిపేట, వెలుగు:  రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థలంలో హైకోర్టుకు కేటాయిస్తూ జారీ చేసిన జీవో నం. 55ను వెంటనే రద్దు చేయాలని, తీర్మానం చేసి గవర్నరమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ అన్నారు.  ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపి రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆమె వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా చింతకాయల ఝాన్సీ మాట్లాడుతూ..  ప్రస్తుతం కేటాయించిన భూమిలో వందల రకాల మెడిసిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెట్లు, కూరగాయలు, ఇతర పరిశోధనల కోసం చాలా రకాల మొక్కలను పెంచుతున్నారన్నారు.  కార్యక్రమంలో స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ కన్వీనర్ జీవన్, వర్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమల్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.