అయోధ్యకు తర్వాత వెళ్తం: షిండే

అయోధ్యకు తర్వాత వెళ్తం: షిండే

ముంబై: అయోధ్యలో సోమవారం జరిగే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తాను వెళ్లడం లేదని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌ అయిపోయ్యాక తన కేబినెట్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి అయోధ్య రాముడి దర్శనానికి వెళ్లాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.

ఆదివారం జరిగిన టాటా మారథాన్‌ సందర్భంగా షిండే మీడియాతో మాట్లాడారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు కొద్ది మంది మాత్రమే వెళ్లే బదులు.. రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలను తర్వాత తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఆలయం మన విశ్వాసాలకు, గర్వానికి సంబంధించినదని, అందుకే అధికారులను, భక్తులను కూడా ఆయోద్యకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.