ప్రతి కాశ్మీరీ ముస్లిం టెర్రరిస్ట్ కాదు: సీఎం ఒమర్ అబ్దుల్లా

ప్రతి కాశ్మీరీ ముస్లిం టెర్రరిస్ట్ కాదు: సీఎం ఒమర్ అబ్దుల్లా

శ్రీనగర్: ప్రతి కాశ్మీరీ ముస్లిం టెర్రరిస్టు కాదని జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. అమాయకులను ఇంత క్రూరంగా చంపడాన్ని ఏ మతం సమర్థించదని తెలిపారు. జమ్మూకాశ్మీర్‎కు చెందిన ప్రజలపై వివక్ష ఉంటుందని తాను ముందే ఊహించానని చెప్పారు. ఈ మేరకు గురువారం జమ్మూలో రిపోర్టర్లతో ఒమర్ అబ్దుల్లా మాట్లాడారు. 

“జమ్మూకాశ్మీర్ ప్రతి నివాసి టెర్రరిస్టు కాదు. ఉగ్రవాదులతో సంబంధం కలిగి ఉండడు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడి శాంతి, సోదరభావాన్ని కొంతమంది మాత్రమే నాశనం చేస్తారు. జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతి నివాసి, ప్రతి కాశ్మీరీ ముస్లింను టెర్రరిస్టు అనుకుంటే ఇక్కడి ప్రజలను సరైన మార్గంలో ఉంచడం కష్టం. పేలుడుకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి”అని పేర్కొన్నారు.