రేడియో, డీడీల్లో ఔట్‌సోర్సింగ్‌!

రేడియో, డీడీల్లో ఔట్‌సోర్సింగ్‌!

15వేల పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

న్యూఢిల్లీ: ఆల్‌ ఇండియా రేడియో, దూర్‌‌దర్శన్‌, ప్రసార భారతిల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌‌ ఆదేశించారు. దాని కోసం రెగ్యులర్‌‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ను కాకుండా.. కాంట్రాక్ట్‌ బేస్‌లో కన్సల్టెంట్లను తీసుకోవాలని ఆదేశించారని అధికారులు చెప్పారు. ఆయా సంస్థల్లో మొత్తం 42 వేల పోస్టుల ఖాళీ ఉండగా.. వాటిలో కేవలం 27 వేలు మాత్రమే భర్తీ అయ్యాయి, మిగతా 15 వేల పోస్టులను ఔట్‌సోర్సింగ్‌ ద్వారా భర్తీ చేయాలని మంత్రి చెప్పినట్లు సమాచారం. ఈ పోస్టులు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌,యూపీఎస్సీ భర్తీ చేస్తుంది. ఖాళీలకు సంబంధించి ఆడిట్‌ నిర్వహించి ఆ తర్వాత వాటిని ఎలా భర్తీ చేయాలనే దానిపై రోడ్‌మ్యాప్‌ తయారు చేస్తామని అధికారులు చెప్పారు.