కొత్త బిజినెస్​లకు.. నాట్ ఇంట్రెస్టెడ్

కొత్త బిజినెస్​లకు.. నాట్ ఇంట్రెస్టెడ్
  •     కొవిడ్​ థర్డ్ వేవ్ భయంతో వాయిదాలు​ 
  •     షాపుల ఓపెన్​కు  
  •     ఔత్సాహికులు నో ఇంట్రెస్ట్​

హైదరాబాద్, వెలుగు: కరోనా థర్డ్ వేవ్ భయంతో కొత్త బిజినెస్​లు స్టార్ట్​చేసేందుకు, ఉన్న వాటిని డెవలప్ చేసేందుకు వెనకాడుతున్నారు. కరోనా, లాక్​ డౌన్ సమయాల్లోనే బిజినెస్​లు మూతపడడంతో చిరు వ్యాపారుల నుంచి పెద్ద బిజినెస్​ల వరకు ఇబ్బందులు పడ్డారు.  ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కొందరు బిజినెస్​లను తీసేశారు. ఇప్పుడూ అదే జరిగితే పరిస్థితేంటునుకుంటూ వెయిట్ చేయడమే బెటరని డిసైడ్ అయ్యారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బట్టల షాపులు, జిమ్స్, స్వీట్ హౌజ్ ల నుంచి క్యాబ్​ల వరకు ఇంట్రెస్ట్​ చూపడం లేదు. ఇది వరకే షాపులకు అడ్వాన్స్​ఇచ్చిన వారు కూడా నెల, రెండు నెలల అద్దె పోయినా సరే అని పోస్ట్​ పోన్​ చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో అంతా నార్మల్​గా ఉంటే బిజినెస్​ స్టార్ట్​ చేద్దామనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ ఎఫెక్ట్ హోటల్ ఇండస్ర్టీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేసులు మళ్లీ పెరిగితే ముందుగా మూతపడేవి హోటల్స్​ కావడంతో కొత్తగా  ఏర్పాటుకు ఇంట్రెస్ట్ చూపడం లేదు. గ్రేటర్ లోని అన్నిచోట్ల షాపుల కోసం స్పేస్​ ఉన్నట్లు టూ లెట్ బోర్డులు చాలా ఉన్నాయి. గతేడాది లాక్ డౌన్ టైమ్​లో ఖాళీ చేసిన షాపులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇప్పడిప్పుడే బిజినెస్​లు స్టార్ట్​చేద్దామనుకొనే వారు కూడా వెనక్కి తగ్గి మరి కొన్నాళ్లు ఖాళీగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాలనీల నుంచి కమర్షియల్​ కారిడార్ల వరకు టూ లెట్ బోర్డులే కనిపిస్తున్నాయి.