బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సత్యదేవ్

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సత్యదేవ్

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడమే కాదు.. డిఫరెంట్ పాత్రలు పోషించి ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నాడు సత్యదేవ్. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వాటిలో కన్నడ స్టార్ డాలీ ధనుంజయతో కలిసి నటిస్తున్న సినిమా ఒకటి. ‘పెంగ్విన్’ ఫేమ్ ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిల్మ్స్ బ్యానర్స్‌‌‌‌పై  ఎస్.ఎన్.రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం కలిసి నిర్మిస్తున్నారు. సుమన్ ప్రసార బాగే కో ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ మల్టీస్టారర్  మూవీ మొదటి షెడ్యూల్‌‌‌‌ పూర్తయింది.

నవంబర్‌‌‌‌‌‌‌‌ లాస్ట్‌‌‌‌ వీక్‌‌‌‌లో స్టార్టయిన రెండో షెడ్యూల్ ఫిబ్రవరి మొదటివారం వరకు  జరగనుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని సమ్మర్‌‌‌‌‌‌‌‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. జెన్నిఫర్ పిచినెటో, సత్యరాజ్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మీరాఖ్ డైలాగ్స్ రాస్తున్నాడు. చరణ్ రాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.