
అలియా భట్, శార్వరీ వాఘ్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘ఆల్ఫా’. శివ్ రావేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో వస్తున్న ఫస్ట్ ఫిమేల్ లీడ్ మూవీ ఇది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో స్పై ఏజెంట్‌గా కనిపించబోతోంది అలియా భట్. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ దీనికి వర్క్ చేస్తున్నారు. అనిల్ కపూర్, బాబీడియోల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అలియా గురువు పాత్రలో హృతిక్ రోషన్ కనిపించబోతున్నాడనే ప్రచారం జరిగింది.
అయితే ఈ సినిమా కంటే ముందు యశ్ రాజ్ సంస్థ నుంచి వస్తున్న మరో స్పై యూనివర్స్ ‘వార్ 2’ చివరలో అలియా కనిపించబోతోందట. నిజానికి ‘వార్ 2’ క్లైమాక్స్‌లో షారుఖ్ ‘పఠాన్’ గెటప్‌లో కనిపిస్తాడనే ప్రచారం జరిగింది. కానీ ఇదే సంస్థ నుంచి నెక్స్ట్ వస్తున్న సినిమా ‘ఆల్ఫా’ కావడంతో అలియా, శార్వరీలపై ప్రత్యేకంగా కొన్ని సీన్స్ షూట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు లీడ్ ఇచ్చేలా ‘వార్ 2’ ఎండింగ్ ఉండబోతోంది.
ఇలా స్పై యూనివర్స్ సినిమాల్లో మరో రా ఏజెంట్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం తెలిసిందే. సల్మాన్ ‘టైగర్ 3’లోనూ హృతిక్ ‘వార్ 2’ క్యారెక్టర్‌లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు. అలాగే మన దక్షిణాదిన కమల్ హాసన్ ‘విక్రమ్’లో సూర్య, నాని ‘హిట్ 3’లో కార్తిని కూడా ఇలా చూశాం. ఇక హృతిక్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘వార్ 2’ ఆగస్టు 14న విడుదల కానుండగా, క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్‌లో ‘ఆల్ఫా’ రానుంది.