
టాలీవుడ్ ఇండస్ట్రీలో కేపీ చౌదరి డ్రగ్స్ కేసు(Tollywood drags case) పెద్ద దుమారమే రేపుతోంది. ఈ కేసులో విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేపీ చౌదరి(kp chawdary) ఫోన్ కాల్ లిస్టులో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లున్నాయని సంచారం. ఆ లిస్టులో ముఖ్యంగా బిగ్ బాస్(Bigg boss) బ్యూటీ అషు రెడ్డి(Ashu reddy), నటి సురేఖావాణి(Surekha vani) పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో టాలీవుడ్ లో ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే టెన్షన్ మొదలైంది. ఇక ఈ కేసులో తన పేరు వినిపించడంపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది అషూరెడ్డి. ఆ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అనవసరంగా తన పేరును లాగుతున్నారని తెలిపింది.
ఇవి కూడా చదవండి: రీమేక్ చేశాడంటే.. హిట్ కొట్టినట్టే.. మెహర్ రమేష్ క్రేజీ సెంటిమెంట్
ఇక కేపీ చౌదరి రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న 12 మందికి నోటీసులు పంపించి వారిని కూడా విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వివిధ ప్రాంతాలకు చెందిన బెజవాడ భరత్, వందనాల అనురూప, చింతా సాయి ప్రసన్న, చింతా రాకేష్ రోషన్, నల్లా రతన్ రెడ్డి, ఠాగోర్ విజ్ అలియాస్ ఠాగోర్ ప్రసాద్ మోటూరి, తేజ్ చౌదరి అలియాస్ రఘు తేజ, వంటేరు శవన్ రెడ్డి, సనా మిశ్రా, శ్వేత, సుశాంత్, నితినేష్‌లకు కేపీ చౌదరి డ్రగ్స్ విక్రయించినట్లు కస్టడీ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. మరి ఈ పన్నెండు మంది విచారణతో ఈ కేసు ఆడుతుందా? లేదా ఈ విచారణలో ఇక కొత్త పేర్లు ఏమైనా వినిపిస్తాయాయా అనేది తెలియాల్సి ఉంది.