మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఆగస్టు 5 వరకు దరఖాస్తుకు అవకాశం


హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌ విడుదల అయింది. కాంట్రాక్ట్‌‌ పద్ధతిలో భర్తీ చేసే ఈ పోస్టుల కోసం మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌ మెంట్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రో బయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయని తెలిపింది. కాలేజీల వారీగా ఖాళీల వివరాలను ఆగస్టు 8న వెల్లడిస్తామని పేర్కొంది. 

ఆసక్తి ఉన్న వారు తమ బయోడేటా, ఇతర సర్టిఫికెట్లను dmerecruitment.contract@gmail.comకు ఆగస్టు 5వ తేదీ వరకు పంపించాలని సూచించారు. 9న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇటీవలే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినా, 40 శాతానికిపైగా పోస్టులకు అర్హులెవరూ దరఖాస్తు చేయలేదు. మరో నెల రోజుల్లో ఎంబీబీఎస్ క్లాసులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.