
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (టీఎస్ఎల్పీబీ) తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూషన్ సర్వీసులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(క్యాటగిరీ–6) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
పోస్టుల సంఖ్య: 118 (అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్). మల్టీజోన్–I 50, మల్టీజోన్–IIలో 68 పోస్టులు ఉన్నాయి.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ లేదా బీఎల్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్మీడియట్ తర్వాత ఐదేండ్ల లా విద్యను అభ్యసించిన అభ్యర్థులు కూడా అర్హులే. తెలంగాణ రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టుల్లో కనీసం మూడేండ్లకు తక్కువ కాకుండా
న్యాయవాద వృత్తి నిర్వహిస్తుండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 34 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా. అప్లికేషన్ ప్రారంభ తేదీని ఇంకా వెల్లడించలేదు.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.tgprb.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
ఎగ్జామ్ ప్యాటర్న్
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగానికి ఎంపిక కోసం నిర్వహించే ఎగ్జామ్ రెండంచెల్లో ఉంటుంది. పేపర్–1లో మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 శాతం మార్కులు కోత విధిస్తారు.
పేపర్–2లో డిస్క్రిప్టివ్ విధానంలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. అభ్యర్థులు రెండు పేపర్లలోనూ తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. కనీస అర్హత మార్కులు 40 శాతం(జనరల్, ఈడబ్ల్యూఎస్), 35 శాతం(బీసీ), 30 శాతం(ఎస్, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ) సాధించాల్సి ఉంటుంది. పేపర్–1లో క్వాలిఫై అయితేనే పేపర్–2 జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేస్తారు. రెండు పేపర్లలోనూ సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.