ఎక్స్‌‌‌‌టెన్షన్‌‌‌‌ ఆఫీసర్లు/ సూపర్‌‌‌‌వైజర్ల పోస్టులకు నోటిఫికేషన్​ రిలీజ్​

ఎక్స్‌‌‌‌టెన్షన్‌‌‌‌ ఆఫీసర్లు/ సూపర్‌‌‌‌వైజర్ల పోస్టులకు నోటిఫికేషన్​ రిలీజ్​

తెలంగాణ పబ్లిక్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ కమిషన్‌‌‌‌ (టీఎస్‌‌‌‌పీఎస్‌‌‌‌సీ) మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో 181 గ్రేడ్‌‌‌‌-1 ఎక్స్‌‌‌‌టెన్షన్‌‌‌‌ ఆఫీసర్లు/ సూపర్‌‌‌‌వైజర్ల పోస్టులకు నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. మహిళా అభ్యర్థులు మాత్రమే ఇందుకు అర్హులు. సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ పూర్తిచేసుకున్నవారు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​:  రాత పరీక్షలో రెండు పేపర్లు. పేపర్‌‌‌‌-1 (జనరల్‌‌‌‌ స్టడీస్‌‌‌‌ అండ్‌‌‌‌ జనరల్‌‌‌‌ ఎబిలిటీస్‌‌‌‌), పేపర్‌‌‌‌-2 సంబంధిత సబ్జెక్టు (డిగ్రీ స్థాయి)లో ప్రశ్నలుంటాయి. పేపర్‌‌‌‌-1లో 150 ప్రశ్నలు, పేపర్‌‌‌‌-2లో 150 ప్రశ్నలు.. మొత్తం 300 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌‌‌‌ పరీక్షా విధానంలో కంప్యూటర్‌‌‌‌ బేస్డ్‌‌‌‌ (ఆన్‌‌‌‌లైన్‌‌‌‌) పరీక్ష నిర్వహిస్తారు. ఈ పోటీ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒకటి జనరల్‌‌‌‌ స్టడీస్‌‌‌‌ అండ్‌‌‌‌ జనరల్‌‌‌‌ ఎబిలిటీస్‌‌‌‌, రెండోది సబ్జెక్టు సంబంధిత పరీక్ష. సబ్జెక్టు సంబంధిత పరీక్షలో ఉమ్మడి సిలబస్‌‌‌‌ ఉంటుంది. 11 రకాల డిగ్రీలు అర్హతకు ప్రాతిపదిక కాబట్టి అందరికీ సమాన అవకాశాలు ఇచ్చే ఉద్దేశంతో సబ్జెక్టు సంబంధిత పేపర్‌‌‌‌ సిలబస్‌‌‌‌ను తయారుచేశారు.

జోన్ల వారీగా ఖాళీలు:  మొత్తం 181 పోస్టుల్లో కాళేశ్వరం- జోన్​ నుంచి 26, బాసర- –27, రాజన్న- –29, భద్రాద్రి- –26, యాదాద్రి- –21,  చార్మినార్‌‌‌‌- –21, జోగులాంబ- జోన్​లో 31 ఖాళీగా ఉన్నాయి. 

అర్హతలు: బ్యాచిలర్స్‌‌‌‌ డిగ్రీ (హోమ్‌‌‌‌ సైన్స్‌‌‌‌/ సోషల్‌‌‌‌ వర్క్‌‌‌‌/ సోషియాలజీ). లేదా బీఎస్సీ (ఫుడ్‌‌‌‌ సైన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ న్యూట్రిషన్‌‌‌‌), బీఎస్సీ (ఫుడ్‌‌‌‌ అండ్‌‌‌‌ న్యూట్రిషన్, బోటనీ/ జువాలజీ అండ్‌‌‌‌ కెమిస్ట్రీ), లేదా బీఎస్సీ  (అప్లైడ్‌‌‌‌ న్యూట్రిషన్‌‌‌‌ అండ్‌‌‌‌ పబ్లిక్‌‌‌‌ హెల్త్, బోటనీ/ జువాలజీ అండ్‌‌‌‌ కెమిస్ట్రీ). లేదా బీఎస్సీ(క్లినికల్‌‌‌‌ న్యూట్రిషన్‌‌‌‌ అండ్‌‌‌‌ డైటెటిక్స్, బోటనీ/ జువాలజీ అండ్‌‌‌‌ కెమిస్ట్రీ). లేదా బీఎస్సీ (అప్లైడ్‌‌‌‌ న్యూట్రిషన్, బోటనీ/ జువాలజీ అండ్‌‌‌‌ కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ). లేదా బీఎస్సీ (ఫుడ్‌‌‌‌ సైన్సెస్‌‌‌‌ అండ్‌‌‌‌ క్వాలిటీ కంట్రోల్, జువాలజీ/ బోటనీ అండ్‌‌‌‌ కెమిస్ట్రీ/ బయోలాజికల్‌‌‌‌ కెమిస్ట్రీ) ఉత్తీర్ణత సాధించాలి.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో సెప్టెంబర్​ 8 నుంచి సెప్టెంబర్ 29 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వయసు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్లికేషన్​ ఫీజు రూ.200 చెల్లించాలి. ఆబ్జెక్టివ్​ పరీక్ష డిసెంబర్ లో నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు www.tspsc.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.