బట్టల షాపు మొత్తం వరదబాధితుల కోసం

బట్టల షాపు మొత్తం వరదబాధితుల కోసం

ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు…కొందరు దాతలు తమకు తోచిన సాయం చేస్తుంటారు. డబ్బు రూపంలో సాయం చేస్తే… కొందరు  బట్టలు, ఆహారపదార్ధాలు, అవసరమైన వస్తు సామగ్రి అందిస్తారు. కేరళ రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలకు ఆ రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది. దాదాపు అన్ని ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలకు నిలువ నీడ లేకుండా పోయింది. దీంతో చాలా మందిని పునరావాస కేంద్రాలకు తరలించి కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారు అధికారులు. అలాంటి వారికి ఎర్నాకుళంకు చెందిన నౌషాద్ అనే బట్టల షాపు యజమాని కూడా తన వంతు సాయం అందించాడు. ఏకంగా తాన బట్టల షాపునే పూర్తిగా వారికి అంకితం చేశాడు. దుకాణంలోని స్టాక్ మొత్తాన్ని వరద బాధితులకు పంచేశాడు. బక్రీద్ త్యాగానికి ప్రతీక అయిన పండుగ కాబట్టి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు నౌషాద్.