తెలంగాణలో నవంబర్‌ 30న వేతనంతో కూడిన సెలవు

తెలంగాణలో నవంబర్‌ 30న వేతనంతో కూడిన సెలవు

తెలంగాణలో నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్ జరగనున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కర్మాగారాలు, దుకాణాలు, పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

అందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ తెలిపింది. కాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనుండగా.. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 

మరోవైపు వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటికే విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో చేస్తున్నాయి. అధికారంలో  ఉన్న బీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్, ఎమ్ఐఎమ్ ఇతర పార్టీల రాజకీయ నేతలు రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాన పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదే అంటూ.. ఎవరి ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు.