క్యాప్సూల్ రూపంలో కరోనా వ్యాక్సిన్

క్యాప్సూల్ రూపంలో కరోనా వ్యాక్సిన్

న్యూఢిల్లీ: భవిష్యత్‌‌లో కరోనా వ్యాక్సిన్ క్యాప్సూల్ రూపంలో వచ్చే అవకాశం ఉంది. వివిధ రూపాల్లో కరోనా వ్యాక్సిన్‌‌ను రూపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీలు యత్నిస్తున్నాయి. తాజాగా ఓ దేశీ కంపెనీ ఈ దిశగా పురోగతి సాధించింది. ప్రేమస్ బయోటెక్ అనే ఫార్మా కంపెనీ కరోనా వ్యాక్సిన్‌‌ను క్యాప్సూర్ రూపంలో అభివృద్ధి చేసింది. ఒరామడ్ ఫార్మాన్యూటికల్స్ అనే అమెరికన్ కంపెనీతో కలసి ప్రేమస్ దీన్ని డెవలప్ చేసింది. ఒరావ్యాక్స్‌‌గా పిలిచే ఈ టీకాను జంతువులపై పైలట్ స్టడీ చేశారు. ఇందులో మంచి ఫలితాలు వచ్చాయని కంపెనీ వర్గాలు తెలిపాయి.