ఇక ఆఫర్ల పండుగ.. ఫెస్టివల్​ సేల్స్​కు సిద్ధమైన ఈ–కామర్స్​ కంపెనీలు

ఇక ఆఫర్ల పండుగ.. ఫెస్టివల్​  సేల్స్​కు సిద్ధమైన ఈ–కామర్స్​ కంపెనీలు
  • కొన్ని ప్రొడక్టులపై 60 శాతం వరకు డిస్కౌంట్‌‌‌‌

న్యూఢిల్లీ: పండుగ అమ్మకాలకు అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ వంటి కంపెనీలు రెడీ అయ్యాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి, భారీ అమ్మకాలను సాధించడానికి ప్రతి ఏడాది మాదిరే ఈసారీ భారీ ఆఫర్లతో, డిస్కౌంట్లతో ఊరించబోతున్నాయి. అంతేగాక ఎక్స్ఛేంజ్​ ఆఫర్లు, డెబిట్​/క్రెడిట్​కార్డులతో డిస్కౌంట్లు ఇవ్వబోతున్నాయి. కొన్ని విభాగాల ప్రొడక్టులపై 60శాతం వరకు తగ్గింపు ఇస్తామని అనేక ఈ–కామర్స్ కంపెనీలు ఇది వరకే ప్రకటించాయి. మరికొన్ని కంపెనీలు పండుగ సీజన్​ను దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రొడక్టులను లాంచ్​ చేస్తున్నట్టు తెలిపాయి. వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్, అమెజాన్ ఇండియా, రిలయన్స్ రిటైల్  జియోమార్ట్  అజియో,  టాటా న్యూ తదితర కంపెనీలు స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్,  ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీజీ) ప్రొడక్టులపై ఆకర్షణీయమైన ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందిస్తాయని అంచనా. ఈ విషయమై ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపింగ్​ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మాట్లాడుతూ, ఈ సంవత్సరం తగ్గింపులు ఇవ్వడంతోపాటు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ప్రమోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం గత సంవత్సరం కంటే 10–-20శాతం అధిక బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేటాయించామని వెల్లడించారు. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్ ఖర్చులను తగ్గించడం ద్వారా ప్రచారానికి బడ్జెట్​ను పెంచామని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ విభాగంలో సగటు తగ్గింపులు 20-–30శాతం వరకు, ఫ్యాషన్ ఉత్పత్తులపై 50–-60శాతం,  సాధారణ వస్తువులపై 30–-40శాతం డిస్కౌంట్లు ఉండొచ్చన్నది అంచనా.

మిడ్ - టు -ప్రీమియం ప్రొడక్టులపై ఫోకస్​

ఈ–కామర్స్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు,  ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పండుగ సీజన్​ను సొమ్ము చేసుకోవడానికి ఉన్న ఏ అవకాశాన్నీ వదలడం లేదు. ఇవి ఈ వారం నుంచే ప్రీ-ఫెస్టివ్ సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మొదలుపెట్టాయి. మిగతా కంపెనీలు వీటిని అక్టోబర్ 8-–10 మధ్య ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఈ విషయమై సమాచారం కోరుతూ అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​, రిలయన్స్​, టాటా న్యూలకు పంపిన ఈ– మెయిల్స్‌‌‌‌‌‌‌‌కు ప్రెస్ సమయం వరకు సమాధానం లేదు. కంపెనీలు తమ పండుగల సీజన్ అమ్మకాల వృద్ధిని గత ఏడాది కంటే మెరుగుపరుచుకోవాలని అనుకుంటున్నందున, మిడ్​ నుంచి ప్రీమియం మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఎక్కువ తగ్గింపులు ఇచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు, స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ బ్రాండ్ రియల్​మీ, ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వినియోగదారులకు ఆఫర్లు ఇవ్వడం కోసం రూ.800 కోట్లు ఖర్చు చేయబోతోంది. ఇదే కంపెనీ గత ఏడాది రూ.700 కోట్లు ఖర్చు పెట్టింది.  మొబైల్ ఫోన్ ఇండస్ట్రీ రీసెర్చర్​ కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్ మార్కెట్ రీసెర్చ్ ప్రకారం.. స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఈ ఏడాది 10-–15శాతం వరకు తగ్గింపును ఇస్తాయి. 4జీ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై 20–-25శాతం వరకు తగ్గింపును అందిస్తాయి. కౌంటర్​ పాయింట్​ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ ఈ విషయమై మాట్లాడుతూ "అనేక బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 13 వారాలుగా అమ్ముడుపోని 4జీ స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ స్టాక్​ను వదిలించుకోవడంపై దృష్టి పెట్టాయి.  సాధారణంగా అయితే స్టాక్​ ఎనిమిది నుంచి తొమ్మిది వారాలలోపు అమ్ముడుపోవాలి. ఇప్పుడు స్మార్ట్​ఫోన్​ కంపెనీల దగ్గర 4జీ ఫోన్ల స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువ ఉంది" అని ఆయన చెప్పారు. మనదేశంలో కోడాక్, థామ్సన్, బ్లూపంక్ట్  వంటి ఎలక్ట్రానిక్ బ్రాండ్ల ప్రొడక్టులను విక్రయించడానికి లైసెన్స్ ఉన్న సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ఈసారి డిస్కౌంట్లను మరో 10శాతం పెంచనుంది.  ఈసారి 43–-65 అంగుళాల టెలివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై భారీ తగ్గింపులు ఇస్తామని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అవనీత్ సింగ్ మార్వా తెలిపారు.