క్వాలిటీ బొగ్గుతోనే సింగరేణికి మనుగడ : ఎన్.రాధాకృష్ణ

క్వాలిటీ బొగ్గుతోనే సింగరేణికి మనుగడ : ఎన్.రాధాకృష్ణ

కోల్​బెల్ట్, వెలుగు: వినియోగదారులకు క్వాలిటీ బొగ్గును సప్లై చేసినప్పుడే పోటీ మార్కెట్​లో సింగరేణికి మనుగడ ఉంటుందని మందమర్రి ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ అన్నారు. గురువారం తన ఆఫీస్​లో బొగ్గు నాణ్యత వారోత్సవాలను ప్రారంభించారు. 

జెండాను ఆవిష్కరించి, ఆఫీసర్లు, ఉద్యోగులు, సిబ్బందితో బొగ్గు నాణ్యతపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జీఎం మాట్లాడుతూ.. ఉత్సవాలను ఈ నెల 19 వరకు నిర్వహిస్తామన్నారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి, రవాణా రంగాల్లో కొత్త రికార్డులు సృష్టిస్తోందని తెలిపారు. 

రక్షణ పట్ల అప్రమత్తంగా ఉంటూ బొగ్గు ఉత్పత్తిని సాధించాలని సూచించారు. సింగరేణి ఆఫీసర్స్​అసోసియేషన్​ జాయింట్​సెక్రటరీ రవి, ఏఐటీయూసీ లీడర్​మల్లేశ్, ఇన్ చార్జి పర్సనల్​ఆఫీసర్​ఆసిఫ్, క్వాలిటీ మేనేజర్ ప్రదీప్​ పాల్గొన్నారు.

ఆర్కేపీ ఓసీపీ లో 18 ఏళ్లు బొగ్గు ఉత్పత్తి  

రామకృష్ణాపూర్​సింగరేణి ఓపెన్​కాస్ట్​ మైన్​ రెండో ఫేజ్​లో 18 ఏళ్లపాటు బొగ్గు ఉత్పత్తి చేయవచ్చని మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ అన్నారు. ఓపెన్​ కాస్ట్​ మైన్ ఆఫీస్​ఆవరణలో గురువారం సాయంత్రం నిర్వహించే పబ్లిక్​ హియరింగ్​కోసం చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. రెండో ఫేజ్​మైనింగ్ కార్యకలాపాలు సాగించేందుకు 597.45 హెక్టార్ల అటవీ భూమి,611.79 హెక్టార్ల ఇతర భూములను సేకరించాల్సి ఉందని చెప్పారు. 

పర్యావరణ అనుమతి కోసం డిసెంబర్​3న నిజామాబాద్​రీజియన్​ తెలంగాణ పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామన్నారు. రెండో ఫేజ్​లో రూ.442.90 కోట్లతో మైనింగ్​చేపడుతామని, ఏటా 3.75 మిలియన్​ టన్నుల చొప్పున బొగ్గు తవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఏరియా సేఫ్టీ ఆఫీసర్​ భూశంకరయ్య, సివిల్ ఎస్ఈ రాము, భూపాలపల్లి ఏరియా పర్సనల్​మేనేజర్​శ్యాంసుందర్, ఎన్విరాన్​మెంట్ ఆఫీసర్​ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

శ్రీరాంపూర్​లో వారోత్సవాలు ప్రారంభం

నస్పూర్‌‌‌‌‌‌‌‌, వెలుగు: శ్రీరాంపూర్ ఏరియాలో బొగ్గు నాణ్యత వారోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. గురువారం జీఎం ఆఫీస్​వద్ద  జీఎం ఎం.శ్రీనివాస్ సింగరేణి ఉద్యోగులు, సిబ్బందితో బొగ్గు నాణ్యత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జీఎం వీరభద్రరావుతో కలిసి ఆయన మాట్లాడారు. 

వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు అందించడం మనందరి బాధ్యత అన్నారు. ఎస్​వోటూ జీఎం ఎన్.సత్యనారాయణ, ఏఐటీయూసీ నాయకుడు బాజీ సైదా, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షుడు, ఏరియా క్వాలిటీ ఇన్​చార్జి వెంకటేశ్వర్​రెడ్డి, ఏజీఎం( ఫైనాన్స్) సుమలత, డీజీఎంలు అనిల్ కుమార్, ఆనంద్ కుమార్, హరినారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఆర్కే–6 గని సందర్శన

ఆర్కే–6 గని మూసివేత పనులను హైదరాబాద్ రీజియన్  డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ మైనింగ్ ఆఫీసర్ నాగేశ్వరరావు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ సర్వే ఆఫీసర్ శ్రీనివాసశర్మ, ఏరియా జీఎం శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. భూగర్భంలో రక్షణ గోడలను తనిఖీ చేశారు.