హరిత‌హారం, ఇరిగేష‌న్ కు ఉపాధి హామీని అనుసంధానం చేయాలి

హరిత‌హారం, ఇరిగేష‌న్ కు ఉపాధి హామీని అనుసంధానం చేయాలి

నిజామాబాద్ : ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే హరితహారం కార్యక్రమాన్ని దాదాపు రూ.140 కోట్లతో చేపడుతామ‌ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నాటిన మొక్కలు తప్పనిసరిగా సంరక్షించుకోవాలని, 85 శాతం మొక్కలను కాపాడాలని ఆయ‌న అన్నారు. నిజామాబాద్ లో జ‌రిగిన ప్రెస్ మీట్ లో మంత్రి మాట్లాడుతూ…హరితహారంలో ఉపాధి కూలీలను వాడుకోవాలన్నారు.ఉపాధి హామీ(national rural employment guarantee act(NREGA)) పనులు మూస పద్దతిలో కాకుండా అభివృద్ధి పనులకు అనుసంధానం చేయాలని సీఎం కేసీఆర్ యోచన అని చెప్పారు.

ఇరిగేషన్ లో కూడా ఉపాధి హామీ ప‌నుల‌ను భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. కొత్త జాబ్ కార్డు కోసం వచ్చే సోమవారం నుంచి అప్లికేషన్ పెట్టుకోవాలని అక్క‌డి ప్ర‌జ‌ల‌తో అన్నారు. రైతులను సంఘటితం చేసేందుకు జిల్లాలో 106 రైతు వేదికలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారన్న మంత్రి.. రైతు వేదికల కోసం ఎవరైనా దాతలు భూమి లేదా డబ్బులు ఇచ్చిన ఆ వేదికలకు వారి పేరు పెడతామ‌ని చెప్పారు.

రైతులు స్వoతంగా కల్లాలు కట్టుకుంటే ఎస్సి, ఎస్టీలకు వంద శాతం, ఇతర రైతులకు 10 శాతం మార్జి న్ ఇస్తే ప్రభుత్వం 90 శాతం ఖర్చు ఇస్తుందని తెలిపారు. ఎరువుల విషయంలో ఎలాంటి కొరత లేదన్నారు. మిడతలు ప్రస్తుతం ఈశాన్యం వైపు వెళ్తున్నాయని… గాలి దిశ మారితే రాష్ట్రం వైపు వచ్చే అవకాశం ఉందని అన్నారు. మిడతలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామ‌ని మంత్రి తెలిపారు.