నిరుపేద పెళ్లి కూతురుకు ఎన్ఆర్ఐ చేయూత

 నిరుపేద పెళ్లి కూతురుకు ఎన్ఆర్ఐ చేయూత

చేర్యాల, వెలుగు: మద్దూరు మండలంలోని మర్మాముల గ్రామానికి చెందిన సుంకోజు రాములు కుమార్తె శ్రీవాణి వివాహానికి శుక్రవారం అదే గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ  ఇప్ప నిశికాంత్ రెడ్డి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు.

 గ్రామానికి చెందిన సుందరగిరి సత్యనారాయణ గౌడ్ సైతం రూ. 2వేలు అందజేశారు. ఆపదలో ఉంటున్న వారికి ఆర్థిక సాయం చేస్తున్న నిశికాంత్ రెడ్డిని స్థానికులు అభినందించారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.