సంగారెడ్డి/జిన్నారం, వెలుగు: తన పట్టా భూమిని వేరొకరి పేరిట మార్చారని పేర్కొంటూ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఎన్ఆర్ఐ ఆందోళనకు దిగాడు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివానగర్ లోని సర్వే నంబర్ 172లో రవిశంకర్(82)కు 14 గుంటలు భూమి ఉంది.
ఆ భూమి ఎలాంటి సంబంధం లేని మరో వ్యక్తిపైకి మారింది. విషయం తెలుసుకున్న రవిశంకర్ ఐదు నెలల కింద అమెరికా నుంచి జిన్నారంకు వచ్చి భూమి తన పేరిట మార్చాలని తహసీల్దార్, ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరిగాడు. ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో శుక్రవారం రవిశంకర్ తహసీల్దార్ ఆఫీస్ ముందు బైఠాయించాడు. తనకు న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేస్తానని స్పష్టం చేశాడు.
