పాక్కు ముచ్చెమటలు పట్టించినం .. 23 నిమిషాల్లోనే 9 టెర్రర్స్థావరాలను నాశనం చేసినం : అజిత్ దోవల్

పాక్కు ముచ్చెమటలు పట్టించినం .. 23 నిమిషాల్లోనే 9 టెర్రర్స్థావరాలను నాశనం చేసినం : అజిత్ దోవల్
  • ఆపరేషన్​ సిందూర్ వివరాలను ప్రస్తావించిన ఎన్ఎస్‌‌‌‌ఏ దోవల్
  • విదేశీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్
  • భారత్‌‌‌‌కు నష్టం జరిగినట్టు ఒక్క ఫొటోనైనా చూపాలని సవాల్​

చెన్నై: ఆపరేషన్​ సిందూర్​ సమయంలో పాకిస్తాన్​కు ముచ్చెమటలు పట్టించామని నేషనల్​ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్‌‌‌‌ఏ)​ అజిత్​ దోవల్​ పేర్కొన్నారు. అయితే, విదేశీ మీడియా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నదని ఫైర్​ అయ్యారు. శుక్రవారం చైన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా దోవల్​ మీడియాతో మాట్లాడారు. భారత సాయుధ బలగాల సామర్థ్యాన్ని ప్రశంసించారు. ‘‘మేం చాలా గర్వపడుతున్నాం..23 నిమిషాల్లోనే పాక్‌‌‌‌లోని 9 ఉగ్రస్థావరాలను టార్గెట్​ చేశాం. ఏ ఒక్క లక్ష్యాన్ని కూడా విడిచిపెట్టలేదు. ఆ లక్ష్యాలకు మించి వేరే ఎక్కడా దాడి చేయలేదు” అని స్పష్టం చేశారు. బ్రహ్మోస్ క్షిపణి, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ సిస్టమ్ లాంటి దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలు, రక్షణ వ్యవస్థల నాణ్యతను దోవల్ ప్రశంసించారు. 

ఆపరేషన్‌‌‌‌ సిందూర్‌‌‌‌ సమయంలో సుఖోయ్‌‌‌‌-30 ఎంకేఐ ఫైటర్​జెట్ల ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్‌‌‌‌ మిసైల్స్​ పాక్​ భూభాగాల లోపలి వరకూ వెళ్లి ఆ దేశానికి చెందిన పలు ఎయిర్‌‌‌‌‌‌‌‌బేస్​లను ధ్వంసం చేశాయని వెల్లడించారు. అలాగే, భారత్​పై పాక్​  ప్రయోగించిన ఫతాహ్‌‌‌‌–11 బాలిస్టిక్‌‌‌‌ మిసైల్​ను ఎయిర్​ డిఫెన్స్​ సిస్టమ్​ ఎస్‌‌‌‌-400 పేల్చేశాయని వివరించారు. ఆత్మ నిర్భర్​ భారత్​లో భాగంగా రక్షణ రంగానికి అవసరమైన పరికరాలను దేశీయంగా రూపొందిస్తున్నామని, భవిష్యత్తులో  ఎలాంటి యుద్ధ పరిస్థితులు ఎదురైనా సమర్థంగా 
ఎదుర్కొంటామని దోవల్ వివరించారు.

ఆధారాల్లేకుండా విదేశీ మీడియాల్లో కథనాలు

ఆపరేషన్​ సిందూర్​ సమయంలో పాకిస్తాన్​ చేసిన దాడుల్లో భారత్​కు నష్టం వాటిల్లిందంటూ విదేశీ మీడియా నిరాధార కథనాలు ప్రచురిస్తోందని మండిపడ్డారు. పాక్‌‌‌‌ దాడుల్లో భారత్‌‌‌‌కు నష్టం కలిగిందనే విషయాన్ని నిరూపించేందుకు  ఒక్క ఆధారాన్ని అయినా చూపాలని సవాల్​ చేశారు. ‘‘పాక్‌‌‌‌ అది చేసింది.. ఇది చేసింది అంటూ విదేశీ మీడియా అసత్య కథనాలు ప్రసారం చేసింది. ఆ దేశంలోని ఉగ్రస్థావరాలపై భారత బలగాలు అత్యంత కచ్చితమైన సమాచారంతోనే దాడులు చేశాయి. 

మే 10కి ముందు.. ఆ తర్వాత పాక్​లోని 13 ఎయిర్​ బేస్​లు ధ్వంసమైన ఫొటోలు మాత్రమే బయటకు వచ్చాయి కానీ.. భారత్‌‌‌‌కు నష్టం జరిగినట్లు ఒక్క ఫొటో కూడా లేదు. భారత్‌‌‌‌కు చెందిన ఆయుధ స్థావరాలకు ఎలాంటి నష్టం జరగలేదు” అని పేర్కొన్నారు.