న్యూఢిల్లీ: ఇండియా స్క్వాష్ ప్లేయర్ రతికా సుతంతిర సీలన్.. ఎన్‌ఎస్‌డబ్ల్యూ ఓపెన్ టోర్నీలో సెమీస్‌లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రతిక 11–8, 11–7, 11–4తో కరెన్ బ్లూమ్ (ఆస్ట్రేలియా)పై గెలిచింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన 24 ఏళ్ల చెన్నై ప్లేయర్ రతిక కీలక టైమ్‌లో వరుసగా పాయింట్లు సాధించింది.
దాంతో 22 నిమిషాల్లోనే ప్రత్యర్థికి చెక్ పెట్టింది. మరోవైపు పీఎస్‌ఏ కూపర్ ఈవెంట్ (సెయింట్ జేమ్స్ ఎక్స్‌ప్రెషన్ ఓపెన్)లో ఐదోసీడ్ వీర్ చోత్రాని 11–7, 10–12, 11–5, 11–8తో మహ్మద్ షరాఫ్ (ఈజిప్ట్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది.
