నాసల్ వ్యాక్సిన్ను బూస్టర్ డోస్గా వాడాలె : డా. ఎన్ కే అరోరా

నాసల్ వ్యాక్సిన్ను బూస్టర్ డోస్గా వాడాలె : డా. ఎన్ కే అరోరా

భారత్ బయోటెక్ తయారు చేసిన నాసల్ వ్యాక్సిన్ ‘ఇన్ కో వాక్’ ను కేవలం ఫస్ట్ బూస్టర్ డోస్ గా వాడాలని డాక్టర్ ఎన్కే అరోరా సూచించారు.  కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ అరోరా.. ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ పై కీలక సూచనలు చేశారు. ఇప్పటికే బూస్టర్ డోస్ గా ఇతర వ్యాక్సిన్లను తీసుకున్న వారికి నాలుగో డోస్ అవసరం లేదని ఆయన అన్నారు. ఇటీవలే కొవిన్ పోర్టల్ లో ఇన్ కో వాక్ ను ఇంట్రడ్యూస్ చేశారు. జనవరి చివరి వారం నుంచి ఈ ముక్కు వ్యాక్సిన్ ను ఇవ్వనున్నారని తెలిపారు. ఒకే రకమైన యాంటీజెన్స్ ను పదే పదే ఇవ్వడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందన తగ్గుతుందని డాక్టర్ ఎన్కే అరోరా అన్నారు.   

ఇందుకోసమే M–RNA ఆధారంగా తయారైన వ్యాక్సిన్లకు 6 నెలల గ్యాప్ ఇచ్చామని ఎన్కే అరోరా తెలిపారు. ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ నేరుగా గొంతు ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుందని, అక్కడ వైరస్ ను ఆపే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఇది కేవలం కరోనా వైరస్ ను ఆపడమే కాకుండా.. ఇతర శ్వాస సంబంధ సమస్యలు కలిగించే వైరస్ లకు అడ్డుకట్ట వేస్తుందని చెబుతున్నారు. బూస్టర్ డోస్ వేసుకోని 18 ఏళ్ల పైబడ్డ వారే నాసల్ వ్యాక్సిన్ వేసుకునేందుకు అర్హులని చెప్పారు. ‘ఇన్ కో వ్యాక్’ నాలుగు చుక్కలు వేస్తారని.. టీకా వేశాక 15 నుంచి 30 నిమిషాలు అబ్జర్వేషన్ లో ఉండాలని ఎన్కే అరోరా తెలిపారు.