
న్యూఢిల్లీ: బాండ్లు, ఎన్సీడీల ద్వారా రూ.12 వేల కోట్లు సేకరించడానికి తమ బోర్డు ఆమోదం తెలిపిందని ఎన్టీపీసీ తెలిపింది. పన్ను విధించదగిన/పన్ను రహిత, సంచిత/సంచితం కాని, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల ద్వారా ఈ డబ్బును సమకూర్చుకుంటామని తెలిపింది. ప్రైవేట్ప్లేస్మెంట్ పద్ధతిని అనుసరిస్తామని వెల్లడించింది. వచ్చే ఏజీఎంలోపు నిధుల సమీకరణ పూర్తవుతుందని ఎన్టీపీసీ తెలిపింది.