
న్యూఢిల్లీ: ఎన్‌టీపీసీ, మార్చి క్వార్టర్లో కన్సాలిడేటెడ్ పద్ధతిలో నికర లాభం 22 శాతం పెరిగి రూ. 7,897.14 కోట్లకు చేరిందని శనివారం తెలిపింది. ఆపరేటింగ్ ఆదాయం ఎక్కువ రావడం దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. 2023–-24 -మార్చి క్వార్టర్ కంపెనీ నికర లాభం రూ. 6,490.05 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 47,628.19 కోట్ల నుంచి రూ. 49,833.70 కోట్లకు పెరిగింది.
మొత్తం 2025 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 21,332.45 కోట్ల నుంచి రూ. 23,953.15 కోట్లకు పెరిగింది. ఆదాయం కూడా రూ. 1,78,524.80 కోట్ల నుంచి రూ. 1,88,138.06 కోట్లకు చేరింది. డైరెక్టర్ల బోర్డు 2024–-25 సంవత్సరానికి 33.50 శాతం (ఒక షేరుకు రూ. 3.35) తుది డివిడెండ్‌ను సిఫార్సు చేసింది.