Jobs : లక్షన్నర జీతంతో.. NTPCలో ఉద్యోగాలు

Jobs : లక్షన్నర జీతంతో.. NTPCలో ఉద్యోగాలు

అసిస్టెంట్ మైన్ సర్వేయర్ పోస్టుల భర్తీకి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) లిమిటెడ్ దరఖాస్తులను అహ్వానిస్తోంది. మొత్తం 11 పోస్టులున్నాయి.అర్హులు, ఆసక్తిగల అభ్యర్థులుNTPC అధికారిక వెబ్ సైట్ntpc.co.in లో ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేది డిసెంబర్ 8, 2023. వీటిలో 7 అన్రిజర్వ్ డ్ కేటగిరి, 2 బీసీ, షెడ్యూల్డ్ కులాలు(sc), ఆర్థికంగా వెనకబడిన తరగతులు (EWS) అభ్యర్థులకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. 

అర్హతలు: 

అభ్యర్థులు ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ(DGMS) జారీ చేసిన సర్వేయర్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీతోపాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్/ మైనింగ్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి వుండాలి.

వయోపరిమితి: అభ్యర్థి వయస్సు 30 ఏళ్లకు మించరాదు. 

దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు  నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అధికారిక వెబ్ సైట్ careers.ntpc.co.in ను సందర్శించాలి.
  • బొగ్గు గనుల ప్రాంతంలో అసిస్టెంట్ మైన్ సర్వేయర్ నియామకం  అని ఉన్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి
  • దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది 
  • దరఖాస్తు ఫారమ్ లో రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ , పుట్టిన తేది, ఇతర అన్ని అవసరమైన వివరాలను నమోదు చేయాలి 
  • డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి 
  • దరఖాస్తు ఫారమ్ లో అందించిన మొత్తం సమాచారాన్ని  క్రాస్ చెక్ చేసి SUBMITపై క్లిక్ చేయాలి. 
  • దరఖాస్తు ఫారమ్ ను ఫ్రింట్ ఔట్ తీసుకోవాలి. 

రిజిస్ట్రేషన్ ఫీజు : 

జనరల్/ ఇతర వెనకబడిన తరగతి(OBC), ఆర్థికంగా వెనకబడిన తరగతి (EWS) కేటగిరీ అభ్యర్థులు రూ. 300 నాన్ రీఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ,XSM, మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.