
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన కరెంటు తయారీ కంపెనీ ఎన్టీపీసీ ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన నాన్- కన్వర్టబుల్ డిబెంచర్ల జారీ ద్వారా రూ.నాలుగు వేల కోట్లు సేకరించాలని నిర్ణయించినట్లు బుధవారం తెలిపింది.
ఈ ఆదాయాన్ని మూలధన వ్యయానికి నిధులు సమకూర్చడం, ప్రస్తుత అప్పుల రీఫైనాన్సింగ్, ఇతర సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఎన్సీడీలకు సంవత్సరానికి 6.84 శాతం కూపన్ రేటు చెల్లిస్తారు. ఇవి పదేళ్లకు మెచ్యూర్ అవుతాయి. ఈ డిబెంచర్లు బీఎస్ఈలో లిస్ట్ అవుతాయి.