
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఆత్రుతగా ఎదురుచూస్తున్న 30వ చిత్రం సెట్స్ పైకి వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, కొరటాల శివ, జాన్వీకపూర్, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సంగీత దర్శకుడు అనిరుధ్, నిర్మాత కల్యాణ్ రామ్ తదితరులు సందడి చేశారు.
మరో ముఖ్య విషయమేమిటంటే ఆర్ఆర్ఆర్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసి, ఇటీవలే ఆస్కార్ పురస్కారాన్ని అందించిన దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రానికి క్లాప్ కొట్టగా.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కోస్టల్ ఏరియాలోని ల్యాండ్‌పై సాగే ఈ కథలో మనుషులకంటే ఎక్కువగా మృగాలుంటాయి.. దేవుడంటే భయం లేదు.. చావంటే భయం లేదు.. ఒకటే ఒకటి అంటే భయం.. అదే ఈ సినిమా నేపథ్యం.