
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ఎన్టీఆర్30. స్టార్ డైరెక్టర్ కొరటాల తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ విలన్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తుండటంతో బాలీవుడ్ లోనే ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ఎదురుచూస్తున్నారు ఫాన్స్. దీంతో ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ గా మారుతోంది.
ఇక తాజాగా వనిపిస్తున్న న్యూస్ ఒకటి అటు ఫాన్స్ తో పాటు, ఇండస్ట్రి వర్గాలను షాక్ కి గురిచేస్తోంది. అదేంటంటే.. సాధారణంగా పాన్ ఇండియా రేంజ్ సినిమా అంటే అంటే.. క్యాస్టింగ్ కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తారు మేకర్స్. కానీ.. కొరటాల మాత్రం ఇందుకు బిన్నంగా ఉన్నాడు. సినిమా మొత్తం సీరియల్ ఆర్టిస్టులతో నింపేస్తున్నాడు. అవును.. వారం రోజుల క్రితం ఎన్టీఆర్ 30 లో సీరియల్ హీరోయిన్ చైత్ర.. సైఫ్ కు భార్యగా నటిస్తున్నారనే వార్తలు వినిపించాయి. దీంతో.. ఇంతపెద్ద సినిమాలో సీరియల్ ఆర్టిస్ట్ ఏంటి..? అని అసహనం వ్యక్తం చేశారు చాలా మంది.
ఇక ఇప్పుడు మరో సీరియల్ ఆర్టిస్ట్ ను ఎన్టీఆర్ 30 లోకి తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె మరెవరో కాదు మణిచందన. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఆమె.. ఆ తరువాత సపోర్టింగ్ రోల్స్ తో మెప్పించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళం సీరియల్స్ లో నటిస్తుంది. ఆమెను.. జాన్వీ కపూర్ తల్లి పాత్ర కోసం సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో ఎన్టీఆర్ అభిమానులు.. కొరటాల పై ఫైర్ అవుతున్నారు. సినిమా తీస్తున్నావా.. ? సీరియల్ తీస్తున్నావా..? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మరి.. వరుసగా వినిపిస్తున్న ఈ న్యూస్ పై చిత్ర యూనిట్ ఎలా స్పందింస్తుందో చూడాలి.