
ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్రేజ్ బాగుంది. తారక్ ను చూస్తే నన్ను నేను చూసినట్టే అనిపిస్తోందన్నారు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. హృతిక్ రోషన్ , ఎన్టీఆర్ కలిసి నటించిన 'వార్ 2'. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూసుఫ్ గూడ గ్రౌండ్ లో నిర్వహించారు.
తారక్ మీకు అన్న.. నాకు తమ్ముడు అంటూ అభిమానులను ఉద్దేశించి హీరో హృతిక్ రోషన్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్రేజ్ బాగుంది. మరో నాలుగు రోజుల్లో 'వార్ 2' వస్తోంది.. యుద్దానికి రెడీనా అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు. తారక్ తో నటించడం మొదలు పెట్టినప్పుడే మేమిద్దరం నిజమైన బ్రదర్స్ లా కలిసిపోయాం. మీరందరూ నా తమ్ముడిని ఎప్పటికీ ఇలాగే ప్రేమించాలని కోరుకుంటున్నా. నా కెరీర్ లోనూ ' వార్ 2' టాప్ ప్లేస్ లో ఉంటుందని చెప్పారు.
ఇందులో కబీర్ పాత్ర చేసినప్పుడు ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ మూవీలో ఎన్నో యాక్షన్, ఎమోషన్ సీన్లు ఉన్నాయి. కహోనా ప్యార్ హై, క్రిష్ సినిమాలు చేసినప్పుడు ఎంత పేరు వచ్చిందో కబీర్ పాత్ర చేసినప్పుడు అంతే వచ్చిందని చెప్పారు. ఈ మూవీ కచ్చితంగా ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. ఎవరూ మిస్ అవ్వొద్దన్నారు. తారక్ ను చూస్తే నన్ను నేను చూసినట్టే అనిపిస్తోంది. నా లాగే తారక్ ఎంతో కష్టపడుతాడు. నేను తారక్ నుంచి ఎంతో నేర్చుకున్నాను. షాట్ కు ఎలా వెళ్లాలో ఎన్టీఆర్ ను చూసి వందశాతం నేర్చుకున్నానని హృతిక్ ప్రశసించారు.
హృతిక్ రోషన్ , ఎన్టీఆర్ తో కలిసి ఈ మూవీ తీయడం నా అదృష్టంగా భావిస్తున్నా అని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అన్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ గారితో కలిసి ఈ సినిమా తీయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ' బ్రహ్మాస్త్ర' ఈవెంట్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రావాల్సింది. అప్పుడు కుదరలేదు. ఇప్పుడు ఈ సినిమాకు ఆయన హీరోగా చేస్తున్నారు. ఇదంతా నాకు డెస్టినీగా అనిపిస్తోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లో మీరు చూసింది కొంత మాత్రమే. సినిమాలో ఎవరూ ఊహించిన పాయింట్ ఉంది. అది థియేటర్లలో మీ అందరినీ ఆశ్చర్యపరుస్తుందని అయాన్ ముఖర్జీ చెప్పారు.
దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ ..హృతిక్, ఎన్టీఆర్ వింధ్య , హిమాచల పర్వతాల్లాంటి వారని అన్నారు. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని చెప్పారు. 'దేవర' సినిమా విడుదలైనప్పుడు ఆ ఏడాది దేవరనామ సంవత్సరమని చెప్పారు. ఇది హృతిక్ రామారావు నామ సంవత్సరంగా మారుతుంది. ఇది యాక్షన్ చిత్రమే కాదు.. అంతకు మించి ఉంటుంది. మెరుపు తీగల్లా ఉన్న హృతిక్, ఎన్టీఆర్ నీ ఒకే తెరపై చూడటానికి రెండు కళ్లూ చాలవు అని అన్నారు.
ఇది డబ్బింగ్ మూవీ కాదు.. పక్కా తెలుగు సినిమా అని నిర్మాత నాగవంశీ అన్నారు. ఎవరి మాటలు నమ్మోద్దు. థియేటర్లకు వెళ్లండి. మూవీని చూడండి అని అభిమానులను కోరారు. ఎప్పుడూ చూడని విధంగా ఈ మూవీ ఉంటుందని చెప్పారు. హిందీలో కంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్లు రావాలన్నారు. ఈ రోజు ఎన్టీఆర్ అన్న మన కోసం కాలర్ ఎగరేశారు. రేపు ఇండియన్ బాక్సాఫీస్ ముందు ఆయన కాలర్ ఎగరేసేలా మనం చేద్దాం అంటూ అభిమానులకు పిలుపునిచ్చారు నాగవంశీ.
ఆదిత్య చోప్రాకు చెందిన యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రం YRF స్పై యూనివర్స్ లో ఆరవ పార్ట్. ఈ 'వార్ 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 14న విడుదల కానుంది. ఇదే రోజు రజనీకాంత్ ( Rajinikanth ) 'కూలీ' , ( Coolie) మూవీ కూడా రిలీజ్ అవుతోంది.